vedarushiforyou@gmail.com +91 9010102107
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాఃపతయేన్నమః
🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌞ఫిబ్రవరి 26, 2025🌝
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణము
శిశిర ఋతువు
మాఘ మాసము
కృష్ణ పక్షము
తిథి: త్రయోదశి ఉదయం 09గం 46ని వరకు తదుపరి చతుర్దశి
వారం: బుధవారము (సౌమ్యవాసరే)
నక్షత్రం: శ్రవణం సాయంత్రం 04గం 34ని వరకు తదుపరి ధనిష్ఠ
యోగం: పరిఘమ రాత్రి 02గం 48ని వరకు తదుపరి శివము
కరణం: వణిజ ఉదయం 09గం 46ని వరకు తదుపరి భద్ర
వర్జ్యం: రాత్రి 08గం 28ని నుండి 10గం 02ని వరకు
దుర్ముహూర్తము: ఉదయం 11గం 49ని నుండి 12గం 36ని వరకు
అమృతకాలం: ఉదయం 07గం 51ని వరకు తిరిగి తెల్లవారుజామున 05గం 51ని నుండి
రాహుకాలం: మధ్యాహ్నం 12గం 00ని నుండి 01గం 30ని వరకు
సూర్యోదయం:6.24
సూర్యాస్తమయం: 6.01

🚩 మహాశివరాత్రి 🚩
శివపార్వతుల చల్లని దీవెనలు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ
మహాశివరాత్రి
💐 శుభాకాంక్షలు 💐

లోకాః సమస్తాః
సుఖినోభవంతు
సర్వే జనాః సుఖినోభవంతు
🚩🇮🇳🌼🙏🌼🇮🇳🚩

🕉🕉 శుభమస్తు 🕉🕉
🛕 🛕 🛕 🛕 🛕 🛕 🛕 🛕

About Veda Rushi

Veda Rushi is an excellent online service that provides authentic and trusted puja services to its clients. With a team of experienced and knowledgeable priests, they offer a wide range of traditional puja services, including homam, vratham, and other rituals/poojas. They ensure that all the rituals are conducted as per the Vedic guidelines and the specific requirements of the clients. With their easy-to-use online booking system and hassle-free puja arrangements, Veda Rushi makes it convenient for anyone to perform puja’s from the comfort of their home. Our services are reliable, affordable, and accessible to anyone who wants to seek the blessings of the divine.

  • The Veda Pandits perform all Pujas, Homa’s and vratham as well as special occasion ceremonies.
🙏🌼🌼🌼🌼🌼🌼🌼🌼🙏 ప్ర: మహాశివరాత్రి విశిష్టత ఏమిటి? ఈరోజు శివుని పుట్టినరోజా?
జ: భగవంతునికి పుట్టినరోజు అనేది ఉండదు... ఎందుకంటే ఆయనకు పుట్టుకే లేదు గనుక. పైగా శివునికి స్వయంభూ, ఆత్మభూ అని పేర్లున్నాయి. తనంత తాను కలిగిన వాడు అని. కలిగిన వాడు, ఉన్నవాడు అని రెండున్నాయి. భగవంతుడు ఎప్పుడూ ఉన్నవాడే. కానీ జగతిని అనుగ్రహించడం కోసం తనను తాను వ్యక్తం చేసుకుంటాడు. వ్యక్తం అవడాన్నే కలగడం అంటారు. అందుకే శివునికి ‘భవుడు(కలిగినవాడు) అని ఒక పేరు ఉన్నది. మహాశివరాత్రి ప్రత్యేకత ఏమిటంటే సృష్ట్యారంభమునందు పరమాత్మ తనను తాను ఒక దివ్యమైన అగ్నిస్తంభాకృతిగా ప్రకటించుకున్నాడు. అది వ్యక్తమవడం. అలా వ్యక్తమైన రోజు మహాశివరాత్రి అని చెప్పబడుతున్నది. కనుక ఇది పుట్టినరోజు అని సరదాగా అనుకోవచ్చు కానీ, భగవంతుడు తనకు తాను ప్రకటించుకున్న రోజు అని భావించవచ్చు. దీనికి సంబంధించి పురాణ కథ... బ్రహ్మవిష్ణువుల నడుమ పరమేశ్వరుడు ఒక మహాలింగంగా ఆవిర్భవించి తన ఆదిమధ్యాంత తత్త్వాన్ని ప్రకటించాడు అని చెప్తున్నారు. అయితే పురాణాలలో కించిత్ అభిప్రాయ భేదం కనిపిస్తోంది. ఒకటి మాఘ బహుళచతుర్దశి అర్ధరాత్రి సమయంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించాడు అని కొన్ని పురాణాలలో కనబడుతున్నది. కానీ మహాశివరాత్రికి సంబంధించిన అంశాలలో శివపురాణంలో మార్గశీర్ష మాసం ఆర్ద్ర నక్షత్రం నాడు పరమేశ్వరుడు ఒక మహాగ్నిలింగంగా ఆవిర్భవించాడు. అని చెప్పారు. ఆ ఉద్భవించిన మహాలింగం తుది, మొదలు తెలుసుకోవాలని బ్రహ్మవిష్ణువులు ప్రయత్నించారు. అందులో బ్రహ్మ హంసరూపంతో పైకి వెళ్తే, విష్ణువు వరాహరూపంతో క్రిందికి వెళ్ళారని కానీ ఉభయులూ తుది, మొదలు తెలుసుకోలేకపోయారని, వారు పరమేశ్వరునే శరణు వేడగా ఆ పరమేశ్వరుడు వ్యక్తమై వారికి తన తత్త్వాన్ని తెలియజేశాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణువులు - ఉభయులూ శివారాధన చేశారు. వాళ్ళు శివుని ఆరాధించిన రోజు మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి సమయం. ఆనాటినుండి శివలింగారాధన వ్యాప్తి చెందింది. బ్రహ్మవిష్ణువుల నుండి దేవతలు, దేవతల ద్వారా ఋషులు, ఋషుల ద్వారా సమస్త ప్రపంచమూ తెలుసుకున్నది. ఈ మొత్తం చెప్తూ మనకు ప్రసిద్ధి చెందిన లింగాష్టకం ఉన్నది. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం అని. ఈ విధంగా పరమేశ్వరుడు తనను తాను వ్యక్తం చేసుకుని తన ఆరాధనను బ్రహ్మవిష్ణువుల ద్వారా వ్యాప్తి చేసిన రోజు మాఘ బహుళ చతుర్దశి. సంవత్సర కాలం శివారాధన చేసిన ఫలితం ఈ ఒక్క రోజు ఆరాధన వల్ల ఫలిస్తుంది అని మనకు శాస్త్రం చెప్తున్నది. అది మహాశివరాత్రి విశిష్టత. [బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి సమాధానం] 🙏🌼🌼🌼🌼🌼🌼🌼🌼🙏