vedarushiforyou@gmail.com +91 9010102107

అక్షరాభ్యాసం:

అక్షరాభ్యాసం లేదా విద్యారంభం లేదా అక్షరారంభం అనేది ఒక సాంప్రదాయమైన కార్యక్రమం, ఆచారం. ఈ కార్యక్రమం జరిపిన నాటి నుండి పిల్లలు అక్షరాలు దిద్దడం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని సాధారణంగా ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పంచమి నాడు వచ్చే వసంతపంచమి నాడు జరుపుకుంటారు. ఈ పూజా కార్యక్రమంలో పిల్లలకు విద్యాదీక్ష ఇవ్వబడుతుంది, తద్వారా పిల్లవాడు అధికారిక విద్యను పొందేందుకు సిద్ధంగా తయారవుతాడు. ఈ ఆచారంలో సరస్వతీ దేవి పూజ చేస్తారు.

Book a Poojari

అన్నప్రాశన:

అన్నప్రాశన లేదా అన్నప్రాశనం పుట్టిన బిడ్డకు తొలిసారిగా అన్నం తినిపించే ఒక కార్యక్రమం. ఇది తెలుగువారి లోగిళ్ళలో కనిపించే ఒక కార్యక్రమం. ఈ సంస్కారం వలన శిశువుకు ఆయువు, ఆరోగ్యం, తేజస్సు వృద్ధి చెందుతాయని ప్రజలు విశ్వసిస్తారు.

Book a Poojari

బారసాల:

బిడ్డ పుట్టిన తరువాత మొదటిసారిగా ఊయలలో వేసే కార్యక్రమాన్ని బారసాల లేదా నామకరణ డోలారోహణ లేదా నామకరణం అంటారు. దీన్ని బిడ్డ పుట్టిన 21వ రోజున చేస్తారు. సనాతన ధర్మం అనగా హిందూ ధర్మంలో షోడశ సంస్కారాలలో(16 Ceremonies)బారసాల ఒకటి.శిశువుకు 1 నక్షత్ర నామం,2.మాసనామం,3.వ్యవహార నామం అని 3 పేర్లు పెడతారు

Book a Poojari

నిశ్చితార్థం:

నిశ్చితార్థం అనగా వివాహ నిశ్చయం. వీలైనంత తక్కువ సమయంలో లేక నిర్ణిత కాల వ్యవధిలో వివాహంద్వారా సంబంధాన్ని ఏర్పచుకుని ఏకమవడానికి చేసిన ప్రతిపాదనను నిశ్చయించుకోవడాన్ని నిశ్చితార్థం అంటారు. దీనిని ఇంగ్లీషులో Engagement అంటారు. నిశ్చితార్ధం జరిగిన తరువాత పెళ్ళి అయ్యేంత వరకు నిశ్చితార్ధపు జంట లోని అబ్బాయిని పెళ్ళి కుమారుడు అని అమ్మాయిని పెళ్ళి కుమార్తె అని వ్యవహరిస్తారు.

వధూవరులు పరస్పరం నచ్చాక వారి తలిదండ్రులు కట్నకానుకలు, ఆభరణాలు మొదలగు విషయాలు మాట్లాడుకొన్న తరువాత ఒక శుభముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించి, లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకొంటారు. ఈ వేడుక ఒక పెళ్ళి కొరకు ఒప్పందం లాంటిదనుకోవచ్చు. నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటం ఒక వేడుక లాగా భావిస్తారు

Book a Poojari

వివాహం:

పెళ్లి అనేది ఒక సాంస్కృతిక సార్వజనీన కార్యం. వివాహం అనే పదానికి పెండ్లి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానం, కల్యాణం, సప్తపది అనేక అర్ధాలున్నాయి. హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైంది. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్లి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా విభేదాలు తలెత్తినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది. ఇక హిందూ సంప్రదాయం ప్రకారం వివాహానంతరం స్త్రీ పురుషులకు అనేక సంప్రదాయక విధులు నిర్వహించే అర్హత కలుగుతుంది.

Book a Poojari