vedarushiforyou@gmail.com +91 9010102107

వరలక్ష్మీ వ్రతం

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.

Book a Poojari

మంగళ గౌరీ వ్రతం

పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.

Book a Poojari

సత్యనారాయణ వ్రతం

శ్రీ సత్యనారాయణ స్వామికి చేసే పూజ.ఈ వ్రతాన్ని హిందూ వధూవరులు శ్రద్ధగా ఆచరించిన వారి కాపురం దివ్యంగా ఉంటుందని పురాణాల ప్రకారం తెలుస్తుంది. విద్యార్థులు, వ్యాపారులు ఇంకనూ ఎవరు ఆచరించిననూ విజయం పొందగలరని హిందువుల విశ్వాసం. కలియుగంన లోక సంచారం చేసిన నారదుడు, లోకుల బాధలు చూడలేక మహావిష్ణువును ప్రార్థించగా స్వామి ఇటుల తెలిపాడు.

కలియుగంన నేను సత్యనారాయణ రూపం ధరించితిని, కావున శ్రీ సత్యనారాయణ వ్రతము చేసినవారికి శోకథుఃఖాలు తొలగి ధనధాన్యాభివృద్ది చెంది సంతానసౌభాగ్యాలు కలిగి సర్వత్రా విజయం లభించి కోరిన కోరికలు తీరును.

అంతట వ్రత విధానంను తెలుసుకొనిన నారదుడు సూతునికి చెప్పగా సూతుడు శౌనకాది మహామునులకు తెలిపాడు

Book a Poojari