vedarushiforyou@gmail.com +91 9010102107

గణపతి హోమం:

గణపతి హోమం :- విఘ్నాలను తొలగించే విఘ్ననాయకుడు గణపతి. మానవులు ప్రారంభించే ప్రతి కార్యాల్లోనూ మొదటగా గణపతిని పూజించడం జరుగుతుంది. ప్రారంభించిన కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుతూ వినాయకుడిని పూజిస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ప్రతికూల అంశాలను తొలగించడానికి వినాయకుడికి గణపతి హోమం నిర్వహిస్తాము. ఈ గణపతి హోమం చేయడం వలన విజయము, ఆరోగ్యము, సంపద కార్య సిద్ధి కలుగుతాయి. హిందూ ధర్మం ప్రకారం ఏ శుభకార్యం చేయాలన్నా మొదటగా గణపతి హోమంతోనే ప్రారంభించడం జరుగుతుంది.

Book a Poojari

చండీ హోమం:

చండీ హోమం ఎందుకు చేస్తారు?అమ్మ ఆది పరాశక్తి అని తెలిసిన విషయమే.! చండీ మాత ఓ ప్రచండ శక్తి. భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది. సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్చాశక్తి, క్రియాశక్తి, కుండలినీ శక్తి! అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం. లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. లోక కల్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోంది. ఆదితత్త్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య.

Book a Poojari

నవగ్రహ హోమం:

నవగ్రహ హోమం అనేది సౌర వ్యవస్థలోని తొమ్మిది గ్రహాలకు అంకితమైన శక్తివంతమైన ఆచారం. ఒక వ్యక్తి జీవితంలో జరుగుతున్న అన్ని తృప్తి మరియు దురదృష్టాల వెనుక ఏకైక కారణం అయిన గ్రహాలను సంతృప్తి పరచడానికి ఇది నిర్వహిస్తారు. ఈ హోమం ముఖ్యమైనది ఎందుకంటే ఈ తొమ్మిది "గ్రహాలు" ఒక వ్యక్తి యొక్క జాతకంలో విశేషమైన పాత్రను పోషిస్తాయి. వారు అతని/ఆమె కోరికలు, కర్మలు మరియు వాటి ఫలితాలను నియంత్రిస్తారు. హోమం గ్రహాల ప్రతికూల ప్రభావాలను (దశ) తగ్గించడంలో సహాయపడుతుంది, తద్వారా వ్యక్తికి సంబంధించిన సానుకూల శక్తులను మెరుగుపరుస్తుంది. అందువల్ల, నవగ్రహ హోమం ఒక వ్యక్తి యొక్క జీవితకాలాన్ని నిర్ణయించడంలో మరియు నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తున్న తొమ్మిది గ్రహాలను ఆనందపరుస్తుంది.

Book a Poojari